పుష్ప 2 లో మార్పులు ఉన్నాయా? బన్నీ అవతారమేంటి?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న్యూలుక్‌ను చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. బ్రౌనిష్ హెయిర్, కొత్త స్టైల్‌లో ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు అల్లు అర్జున్. పుష్ప మొదటి భాగంలో మాసిన గడ్డం, రఫ్ లుక్స్‌తో, పక్కా రాయలసీమ చందనం స్మగ్లర్‌గా కనిపించాడు బన్నీ. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించాడు. అయితే ఇది సంచలన విజయం సాధించడంతో పాన్ ఇండియా ప్రేక్షకుల అంచనాలకు తీసిపోకుండా రెండవభాగాన్ని తీయవలసిన అవసరం ఏర్పడింది. దీనితో అల్లు అర్జున్ స్టైల్ మారిపోయింది. అసలే స్టైలిష్ స్టార్ ముద్ర ఉన్న ఈ హీరో కొత్త లుక్స్‌తో అదరగొడుతున్నాడు. పుష్ప2లో ఇంటర్నేషనల్ స్మగ్లర్‌గా మారబోతున్న పుష్పరాజ్ ఎలా ఉంటాడో, కథలో ఏం మార్పులు ఉంటాయో తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.