Home Page SliderNational

టీడీపీ, బీఆర్‌ఎస్, వైసీపీ పార్టీలు ఎన్డీయేనా, యూపీఏనా?

బెంగళూరులో జరుగుతున్న విపక్షాల భేటీకి గానీ, ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఎన్డీఏ సమావేశాలకు కానీ తెలుగు రాష్ట్రాల పార్టీలు టీడీపీ, బీఆర్‌ఎస్, వైసీపీ పార్టీలకు ఆహ్వానం అందలేదు. 27 పార్టీలతో సమిష్టిగా భేటీ అవుతున్న కాంగ్రెస్ పార్టీకానీ, 38 పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్న బీజేపీ నుండి కానీ ఈ మూడు పార్టీలకు పిలుపు లేదు. వారి సిద్ధాంతాలకు, ప్రయోజనాలకు ఈ జాతీయపార్టీల ప్రయోజనాలకు చుక్కెదురు. ఈ పార్టీలను జాతీయ పార్టీలే పక్కనపెట్టాయా? లేక వీరే వారితో కలవట్లేదా? అనేది అంతుపట్టని ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ, టీడీపీ పార్టీలు ఏ కూటమిలోనూ లేవు. ఇక తెలంగాణలోని బీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీతో కానీ, కాంగ్రెస్‌తో కానీ మంచి సంబంధాలు లేవు. ఇప్పుడు కొత్త జాతీయపార్టీగా అవతరించింది బీఆర్‌ఎస్ పార్టీ.  

ఆంధ్రప్రదేశ్ నుండి జనసేనకు మాత్రమే బీజేపీ నుండి పిలుపు అందింది. చంద్రబాబుకు బీజేపీతో కలవాలని ఉన్నా, నేరుగా అడగలేకపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీని పడగొట్టాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలవాల్సిందే. ఇక వైసీపీకి బీజేపీతో చాలా అవసరాలున్నాయి. రాష్ట్రప్రయోజనాలే వైసీపీకి ముఖ్యం అన్నారు. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా తమకేమీ ప్రాబ్లమ్ లేదంటున్నారు వైసీపీ నేతలు. ఇక ‘యాంటీ బీజేపీ , యాంటీ కాంగ్రెస్’ నినాదంతో ముందుకు పోతోంది. మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉంది. దీనితో తెలుగు పార్టీలు ఏ కూటమిలోనూ చేరలేకపోతున్నాయి.