ఎంగేజ్ మెంట్ కాగానే పిల్లలు పుడతారా ఏంది?
పెళ్లి నిశ్చయం అయ్యింది.అంత మాత్రాన అప్పుడే పిల్లలెంత మంది అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? అసలు అది అడగాల్సిన ప్రశ్నేనా అంటూ తెలంగాణా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీడియాని ఎదురు ప్రశ్నించారు.దావోస్ పెట్టుబడులపై మీడియా ఆయన్ను ప్రశ్నించింది.దీంతో ఆయన పై విధంగా స్పందించారు.తాము చేయాల్సిన ప్రయత్నం చేశామని దాదాపు రూ.1.50లక్షల కోట్ల ఎంవోయూలు కుదుర్చుకున్నామని ఇక కంపెనీల యాజమాన్యాల ఇష్టమంటూ బాంబు పేల్చారు.ఒప్పందాలు చేసుకున్న వారంతా పెట్టుబడులు పెడతారని అనుకోలేం కదా అంటూ మీడియానే ప్రశ్నించారు.ప్రతిపక్షం కన్నా మీడియానే ఈ విషయంలో చాలా ఆసక్తి చూపిస్తుందంటూ సెటైర్లు వేశారు.