బాలయ్య అభిమానుల… మనోభావాలు దెబ్బతిన్నాయా?
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నట సింహం నందమూరి బాలయ్య, వీర సింహారెడ్డి సినిమా కోసం ఓ రేంజ్‌లో డాన్స్ చేశాడు. వీర సింహారెడ్డి సినిమాలో ఐటెమ్ సాంగ్‌ను ఇవాళ విడుదల చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ ఎన్బీకే అంటూ సాంగ్ మొదలయ్యింది. 62 ఏళ్లొచ్చినా బాలయ్య డాన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ మూవీలో శృతి హసన్ కథానాయకగా చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మలినేని గోపిచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

