విశాఖలో దందాలతో ఏఆర్ సీఐ హల్‌చల్
విశాఖలో ఏఆర్ సీఐ స్వర్ణలత దందాకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెపై పలువురు ఫిర్యాదు చేశారు.దీంతో ఉన్నతాధికారులు ఆమెపై కేసు పెట్టారు. కాగా విశాఖలో ఇటీవల రూ.90 లక్షల 500 నోట్లు ఇస్తే రూ.కోటి రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరిని ఓ ముఠా మోసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ముఠాకు ఏఆర్ సీఐ స్వర్ణలత సహకరించినట్లు తేలింది. ఈ కేసులో ఆమె సినిమా స్టైల్‌లో రైడ్స్ చేసి బెదిరించినట్లు సమాచారం. ఇలా బెదిరించి ఆమె బాధితుల నుంచి రూ.15 లక్షలను కొట్టేసినట్లు బయటపడింది. అంతేకాకుండా ఈమె గతంలోనూ అనేక సెటిల్‌మెంట్లు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఏఆర్ సీఐ స్వర్ణలతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


 
							 
							