అసలు AR ఫుడ్స్ ఎవరి దందా… గుట్టు విప్పిన లాయర్ పొన్నవోలు
ఏపీ సమస్యను దేశ వ్యాప్తం చేశారు. ఆ తర్వాత జాతీయ చేశారు. తాజాగా అంతర్జాయం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వారికి నివేదించే లడ్డూ ప్రసాదాల్లో జంతు కొవ్వు ఆనవాళ్లు లభించాయంటూ రేపిన కాక కొనసాగుతోంది. ఎవరి ఆధీనంలో ఇదంతా జరిగిందన్న దానిపై నాయకులు భుజాలుతడుముకుంటుంటున్నారు. నెపం ఒకరిపై ఒకరు వేసి చలికాచుకుంటున్నారు. మొత్తం వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయాలని టీడీపీ చూస్తుంటే, అంతా టీడీపీ అధికారంలోకి వచ్చాకే జరుగుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిగానీ, భూమన కరుణాకర్ రెడ్డి గానీ ఉన్న సమయంలో అసలు తాము ఆరోపణలు ఎదుర్కొంటున్న AR ఫుడ్స్ సంస్థ నుంచి టీటీడీ నెయ్యి కొనుగోలు చేయలేదని కుండబద్ధలుకొట్టారు. వైవీ సుబ్బారెడ్డి 2019 నుంచి 2023 ఆగస్టు వరకు చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు ఆ హయాంలో ఈ సనయమలే AR ఫుడ్స్ కు టెండర్ దక్కలేదు. సప్లై చేయలేదు. వైవీ సుబ్బారెడ్డి AR ఫుడ్స్‌కు అసలు బిడ్డరు కాదు. టెండరూ దక్కలేదు. పార్టిసిపెంట్ గా కూడా లేరు. ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చారు. కరుణాకర్ రెడ్డి హయాంలో ఒక్క గ్రాము కూడా సప్లై చేయలేదు. సుబ్బారెడ్డి హయాం గానీ, కరుణాకర్ రెడ్డి టైమ్ లోనూ ఒక్క ఆర్డర్ ఇవ్వలేదు. సప్లై చేయలేదు. ఇదంతా జరిగింది టీడీపీ హయాంలోనే. రాజీనామా చేసే జూన్ 4 వరకు ఒక్క ఆర్డర్ ఇవ్వలేదు.