Home Page SliderTelangana

అప్సర పోస్టుమార్టంలో కీలక విషయాలు వెల్లడి

సరూర్ నగర్‌లో నివాసం ఉంటున్న అప్సర పోస్టుమార్టం పూర్తయ్యింది. తలపై బలమైన గాయాలు తగలడం వల్లే మృతి చెందిందని రుజువయ్యింది. ఆమె కళ్లపై పదిహేను సార్లు బలంగా కొట్టడంతో కన్ను పూర్తిగా ఛిద్రమయ్యింది.  నగరంలో సంచలనం సృష్టించిన అప్సర అనే యువతిని సాయికృష్ణ అనే పూజారి దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె పెళ్లి చేసుకోమని టార్చర్ చేయడం వల్లే ఏం చెయ్యాలో పాలుపోక హత్య చేశానని ఒప్పుకున్నాడు సాయికృష్ణ. తన కుమార్తెను కిరాతకంగా చంపిన సాయికృష్ణకు కఠినశిక్ష పడాలని కోరుతున్నారు అప్సర తల్లిదండ్రులు. సాయికృష్ణపై ఇప్పటికే 302,201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.