Home Page SliderTelangana

సాయికృష్ణ కుటుంబంపై నిప్పులు చెరిగిన అప్సర తండ్రి- ఆత్మహత్య చేసుకుంటానంటున్న సాయికృష్ణ.

అప్సర అనే యువతిని దారుణంగా హత్యచేసి, పైగా ఆమెపై ఆరోపణలు చేసిన సాయికృష్ణపై, అతని కుటుంబంపై నిప్పులు చెరుగుతున్నారు ఆమె తండ్రి. కుమార్తె మరణవార్త విని, హుటాహుటిన కాశీ నుండి హైదరాబాద్‌కు వచ్చారు ఆమె తండ్రి. తప్పు చేసిన సాయికృష్ణను వదిలి, చనిపోయిన తన కుమార్తె అప్సరపై నిందలు వేయడం, ఆరోపణలు చేయడంతో మండిపడుతున్నారు ఆమె తండ్రి. ఒకే కాలనీలో ఉంటున్న సాయికృష్ణ కుటుంబం ముందుగానే ఎందుకు ఈ విషయాలు అప్సర తల్లి దృష్టికి తీసుకురాలేదని ప్రశ్నించారాయన.  

అప్సర గర్భవతిగా ఉందని, అందుకే సాయికృష్ణను పెళ్లి చేసుకోమందని ఒత్తిడి చేస్తోందని సాయికృష్ణ తండ్రి పేర్కొన్నాడు. మరోవైపు అప్సర తనను పెళ్లి చేసుకోమని టార్చర్ చేసిందని,  ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసిందంటూ శంషాబాద్ పోలీసులకు చెప్తున్నాడు సాయికృష్ణ. ఆమెను చంపే ఉద్దేశం తనకు లేదంటూ, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానంటూ బోరున ఏడుస్తూ హంగామా చేస్తున్నాడు సాయికృష్ణ. రాత్రి పోలీస్ స్టేషన్‌లో నానా హంగామా సృష్టించాడట. ఇప్పుడు పశ్చాత్తాపానికి గురైనట్లు పోలీసులు చెప్తున్నారు. జైలుకు వెళ్లినా తాను బతకనంటూ రోదిస్తున్నాడట. ఈ ఆత్మహత్య బెదిరింపులతో పోలీసులు రాత్రికి రాత్రే అతడిని రిమాండ్‌కు తరలించి,కాపలా ఉన్నారు.