ఏపీ ఆర్థికపరిస్థితి బాగా దిగజారిపోయింది-చంద్రబాబు
ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, బాగా దిగజారిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఇసుకను ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ సంగతిని వైసీపీలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకు లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ దీనివల్ల ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారన్నారు. ఖజానాలో డబ్బు లేకపోయినా నిధుల కోసం ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దలను ఒప్పించి, ఆంధ్రప్రదేశ్‌కు కావలసిన నిధులు తెప్పిస్తున్నాని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తలకు మించిన భారమయ్యిందన్నారు. అప్పులు ఇచ్చిన వారు రోజూ తిరుగుతున్నారని పేర్కొన్నారు.

