కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు షురూ…
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లోనే పరిశీలిస్తారు. అర్హులను పల్లెలలో గ్రామసభలు, పట్టణాలలో బస్తీసభల ద్వారా జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమిస్తున్నారు. రేషన్ కార్డులలో మార్పులకు, తప్పులను సరిచేయడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. కొత్త కార్డులతో పాటు కుటుంబసభ్యులను చేర్చడానికి కూడా అవకాశం ఇస్తున్నారు. రేషన్ కార్డుతోనే ఆరోగ్యశ్రీ కార్డును అనుసంధానించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే కొత్త రేషన్ కార్డుల ఎంపికకు మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు.