Home Page Slider

ఆపిల్ కొత్త ఛీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా భారతీయుడు

11 ఏళ్ల క్రితం ఆపిల్‌లో చేరిన కేవన్ పరేఖ్
కొద్ది రోజుల్లోనే కీలక వ్యక్తిగా ఆవిర్భావం
కంపెనీ ఫైనాన్స్ లీడర్‌షిప్ టీమ్‌లో అంతర్భాగం
కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ గురంచి 5 వాస్తవాలు

భారతీయ సంతతికి చెందిన Apple ఎగ్జిక్యూటివ్ కెవన్ పరేఖ్ కంపెనీ కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. జనవరి 1, 2025 నుండి ఈ బాధ్యత అమల్లోకి వస్తుంది. అనుభవజ్ఞుడైన Apple సీనియర్ ఎగ్జిక్యూటివ్ లూకా మేస్త్రి స్థానంలోకి పరేఖ్ వస్తారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలతో సహా iPhone కోసం ప్రధాన సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ రూపకల్పన జరుగుతున్న సమయంలో నాయకత్వ మార్పు జరుగుతోంది.

కేవన్ పరేఖ్ ఎవరు?

1.కేవన్ పరేఖ్ 11 సంవత్సరాల క్రితం ఆపిల్‌లో చేరారు. కొద్దిరోజుల్లోనే కంపెనీ ఫైనాన్స్ లీడర్‌షిప్ టీమ్‌లో అంతర్భాగమయ్యారు.


2. పరేఖ్ యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ (1989-1993) నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (1997-1999) నుండి MBA చేశారు.


3. Appleలో చేరడానికి ముందు, థామ్సన్ రాయిటర్స్, జనరల్ మోటార్స్‌లో పనిచేశారు. ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్, కార్పొరేట్ ట్రెజరర్, డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్, రీజినల్ ట్రెజరర్‌తో సహా వివిధ సీనియర్ నాయకత్వ స్థానాలను కలిగి ఉన్నారు.


4. 2013లో Appleలో చేరాడు. ఫైనాన్షియల్ ప్లానింగ్, అనాలిసిస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. క్లిష్టమైన బాధ్యతలను నిర్వర్తిస్తూ పేరు గడించాడు. ఇకపై పరేఖ్ కంపెనీ ప్రపంచవ్యాప్త సేల్స్, రిటైల్, మార్కెటింగ్‌కు, ఫైనాన్స్‌కు నాయకత్వం వహించాల్సి ఉంటుంది.

5. గత కొన్ని నెలలుగా కంపెనీ సీనియర్ ఉద్యోగి, లూకా మేస్త్రి… కేవన్ పరేఖ్‌ను, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) పాత్రకు సిద్ధం చేశారు. పరేఖ్ Appleను మరింతగా ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యతను తీసుకునే అవకాశం ఉంది. కంపెనీ అవసరాలకు తగినట్టుగా కాంప్లిమెంటరీ కొనుగోళ్ల కూడా జరిగే అవకాశం ఉంది.

పరేఖ్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కావడంతో ఇప్పటి వరకు ఆ పాత్ర పోషించిన లూకా మేస్త్రి, CEO టిమ్ కుక్‌కి రిపోర్ట్ చేస్తారు. కార్పొరేట్ సేవల బృందాలకు నాయకత్వం వహిస్తారు. ఈయన పదవీకాలంలో, ఆపిల్ తన ఆదాయాన్ని రెట్టింపు చేయగా, సేవల ద్వారా ఆదాయం ఐదు రెట్లు పెరిగింది. కొత్త మోడళ్లలో గణనీయమైన అప్‌గ్రేడ్‌లు లేకపోవడం, తక్కువ ధరలకు హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లను అందించే ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల నుండి పోటీ కారణంగా Apple iPhone విక్రయాలు ఇటీవలి సంవత్సరాలలో కొంత మేర తగ్గాయి. అయినప్పటికీ, ఆపిల్ కొనుగోలుదారులను ఆకర్షించడానికి కృత్రిమ మేధస్సుపై ఫోకస్ పెంచింది. జూన్‌లో జరిగిన డెవలపర్‌ల సమావేశంలో ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ అనే గొడుగు కింద AI ఫీచర్లను సంస్థ ప్రకటించింది.