‘కల్నల్ సోఫియాపై వ్యాఖ్యలకు క్షమాపణలు సరిపోవు’..సుప్రీంకోర్టు
ఆపరేషన్ సిందూర్‌లో కీలకపాత్ర వహించిన కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్‌షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే మంత్రి క్షమాపణలు చెప్పినా వాటిని అంగీకరించలేమని పేర్కొంది. బాధ్యతాయుత ఆర్మీ అధికారిణిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రతిఫలం అనుభవించాలని ఆదేశించింది. ప్రజాప్రతినిధిగా ఉన్న మంత్రి ఆచితూచి మాట్లాడాలని.. బాధ్యతగా ఉండాలని పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై విచారణ కోసం మధ్యప్రదేశ్‌కు సంబంధం లేని ముగ్గురు ఐపీఎస్‌లతో సిట్ ఏర్పాటు చేయాలని, వారిలో ఒక మహిళ ఉండాలని పేర్కొంది. ఈ సిట్ నివేదికను మే 28లోగా అందించాలని ఆదేశించింది.