Andhra PradeshHome Page Slider

ఏపీ వాలంటీర్స్ ఆగ్రహం..సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడి తథ్యం..

ఏపీ వాలంటీర్స్ ప్రభుత్వ నిర్ణయాలపై భగ్గుమంటున్నారు. తమకు రూ.10వేలు జీతం ఇస్తామని మభ్యపెట్టి, మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగులో కూడా వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో వారిలో ఆందోళన నెలకొంది. గత వందరోజులుగా ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై ఎలాంటి నిర్ణయానికి రాకుండా, అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని వాలంటీర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 2 నుండి 26 వరకూ శాంతియుత ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. అప్పటిలోగా తమకు న్యాయం చేయకపోతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గత ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తామని కూటమి పార్టీలు మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.