Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

ఏపీ టెట్ హాల్‌టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్షల కోసం హాల్‌టికెట్లు బుధవారం విడుదలయ్యాయి. డిసెంబర్‌ 10 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా అందుబాటులో ఉంచారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు టెట్‌ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. అక్టోబర్‌ 24 నుంచి నవంబర్‌ 23 వరకు దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్‌ టెస్టులను కూడా అందుబాటులో ఉంచారు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే అభ్యర్థులు tet2dsc.apcfss.in వెబ్‌సైట్‌కి వెళ్లి, క్యాండిడేట్‌ లాగిన్‌ సెక్షన్‌లో యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ను పొందవచ్చు. దాన్ని డౌన్‌లోడ్‌ చేసి భద్రపరుచుకోవాలని సూచించారు.