ఏపీ టీచర్లకు యాప్స్ నుండి విముక్తి.. అన్నీ వెబ్‌సైట్‌లోనే
ఏపీ ప్రభుత్వం టీచర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. పాఠశాల విద్యాశాఖ వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మ్యానువల్ ఫైళ్లుకు ఇకపై స్వస్తి పలకనుంది. టీచర్లు వాడుతున్న యాప్స్‌ను తొలగిస్తామని, ఇకపై అన్నీ వెబ్‌సైట్‌లోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీచర్ల వివరాలు, విద్యార్థుల వివరాలు, ఖాళీ పోస్టులు, బదిలీలు వంటి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో పెట్టి టీచర్లందరికీ లాగిన్ అవకాశం కల్పించనున్నారు. DEO,MEO స్థాయిలో మ్యానువల్ ఫైళ్లను తొలగించి, ఈ-ఆఫీస్ విధానం తీసుకువస్తామన్నారు.