ఏపీ రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ జారీ
వైసీపికి చెందిన ముగ్గురు పెద్దలు రాజీనామా చేయడంతో …పెద్దల సభలో 3 స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి.దీంతో వాటి భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. డిసెంబర్ 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు.అదేవిధంగా డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 13 వరకు గడువు విధించారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యల రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడిన సంగతి తెలిసిందే.