Andhra PradeshHome Page Slider

ఏపీ వాలంటీర్ల కొనసాగింపుపై ఏపీ మంత్రి వ్యాఖ్యలు

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయలేదని, కొనసాగిస్తామని మంత్రి డోలా బాలాంజనేయస్వామి హామీ ఇచ్చారు. నేడు ఆయన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ మంత్రిగా సచివాలయంలోని 3వ బ్లాకులో బాధ్యతలు స్వీకరించారు. ఈ జూలై1న ఇంటింటికీ పెన్షన్లు సచివాలయ ఉద్యోగుల ద్వారా  పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే వాలంటీర్లను తిరిగి ఉద్యోగంలో తీసుకునే విషయంలో స్పష్టత వస్తుందన్నారు.