Andhra PradeshHome Page Slider

ఏపీ మంత్రి బుగ్గన..ఆయన బృందంపై తేనేటీగల దాడి

ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితోపాటు ఆయన సిబ్బందిపై తేనేటీగలు దాడి చేసినట్లు తెలుస్తోంది.కాగా ఈ రోజు నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కనుమకింది కొట్టాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ వైసీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గోనేందుకు మంత్రి బుగ్గన వెళుతుండగా తేనేటీగలు దాడి చేశాయి. కాగా ఈ ప్రమాదం నుంచి మంత్రి బుగ్గన బయటపడ్డారు. అయితే ఆ ప్రమాదంలో ఆయన సిబ్బంది 70మందికి గాయలయ్యాయు. దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.