ముగిసిన ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు
ఈ నెల 15న ప్రారంభమైన శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ బడ్జెట్ సమావేశాల గణాంకాలను వెల్లడించారు.8 రోజులపాటు జరిగిన ఈ 15వ శాసనసభ పదవ సమావేశాల్లో మొత్తం 43 గంటల 12 నిమిషాల పాటు సభ జరిగిందని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 బిల్లులు సభలో ఆమోదం పొందాయని వివరించారు. 69 స్టార్ ప్రశ్నలకు మౌఖిక సమాధానలివ్వగా మరో 29 స్టార్, 2 అన్ స్టార్ ప్రశ్నలకు సభ ముందు ఉంచారని రెండు స్టార్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని పేర్కొన్నారు.రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిగా నూతనంగా రామాచార్యులు నియమితులైనట్లు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.

