AP ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల, బాలికలదే పైచేయి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలను ఇంటర్మీడియట్ విద్యా మండలి శుక్రవారం ప్రకటించింది. ఫలితాల వివరాలను కౌన్సిల్ కార్యదర్శి సౌరభ్ గౌర్ వివరించారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ల ఫలితాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 67 శాతం ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా, గుంటూరు రెండో స్థానంలో, ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. ఇంటర్ పరీక్షల్లోనూ బాలుర కంటే బాలికలే సత్తా చాటినట్లు ఫలితాలు స్పష్టం చేశాయి. మొత్తం 9,99,698 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. సమాధాన పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4న పూర్తయింది.

