ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
ఏపీ హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు హోంమంత్రి అనిత అంతర్వేదిలోని లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్నారు.కాగా అక్కడ ఆలయ అర్చకులు హోంమంత్రికి పూర్ణకుంభం,మేళ తాళాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ..ఏపీలో ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితులు ఉండకూడదన్నారు. కాగా రాష్ట్రంలో గంజాయి,డ్రగ్స్ వాడకాలు బాగా పెరిగాయన్నారు. ఏపీ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో అనేక ఘటనలు జరిగాయన్నారు. కాగా ప్రజలకు వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు త్వరలోనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తామని మంత్రి అనిత వెల్లడించారు.

