మెగాస్టార్‌పై నమోదైన కేసును కొట్టి వేసిన ఏపీ హైకోర్టు
మెగాస్టార్ చిరంజీవిపై గతంలో నమోదైన కేసును ఏపీ హైకోర్టు తాజాగా కొట్టివేసింది. కాగా 2014 ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన ఏపీలో మీటింగ్ నిర్వహించారు. అయితే ఈ మీటింగ్ నిర్ణీత సమయంలో ముగించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అంతేకాకుండా చిరంజీవి ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించారని కేసు నమోదైంది. అయితే తనపై నమోదైన కేసును కొట్టవేయాలని చిరంజీవి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఆయన పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం కేసును కొట్టి వేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.

