రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ కొత్త ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.ఈ మేరకు ఆయన శాసనమండలిలో ప్రకటన విడుదల చేశారు.కాగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.అయితే రాష్ట్రంలో పంట నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకునేలా కేబినెట్ సబ్ కమిటీ నివేదిక రూపొందించిందన్నారు. కాగా సబ్ కమిటీ రూపొందించిన నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ ఏడాది మాత్రం పాత పాలసీనే కొనసాగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.