ఏపీ ఫైబర్‌నెట్ అక్రమాలు..మాజీ ఎండీ సస్పెన్షన్
ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌లో అనేక అక్రమాలు జరిగాయని ప్రభుత్వం గుర్తించింది. మాజీ ఎండీ మధుసూదనరెడ్డిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆయన చేసిన ఆర్థిక అవకతవకలతో ఖజానాకు ఎంతో నష్టం వాటిల్లిందని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ కాలంలో ఆయన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని, అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారని జీవోలో వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల నియామకం చేశారని పేర్కొన్నారు. రికార్డులు ట్యాంపర్ చేశారని, సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని జీవోలో పేర్కొన్నారు.