ఏపీలో ఇంజనీరింగ్ సీట్ల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
ఏపీలో గత నెలలోనే పూర్తికావాల్సిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కొన్ని సమస్యల కారణంగా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు ఈ నెల 13 నుంచి 17 వరకు ఇంజనీరింగ్ సీట్లకు ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఈ నెల 18న ఆప్షన్లలో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు ఈ నెల 22న ఇంజనీరింగ్ సీట్ల కేయాయింపు జగరనుంది. విద్యార్థులు కళాశాలలో చేరేందుకు 23 నుంచి 27 వరకు అవకాశం ఉండబోతుంది. అయితే ఈ నెల 26 నుంచి ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.


 
							 
							