Andhra PradeshHome Page Slider

కాకినాడలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూలై 1 నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కాగా మూడు రోజుల పాటు ఆయన కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. అయితే తొలి రోజు పవన్ గొల్లప్రోలు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన పిఠాపురం జనసేన నేతలతో సమావేశం కానున్నారు. కాగా రెండో రోజు ఆయన కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయితీరాజ్,అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం జనసేన ఎమ్మెల్యేలు,ఎంపీలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. అయితే జూలై 3న ఆయన ఉప్పాడ సముద్ర తీరాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం. కాగా అదే రోజు సాయంత్రం డిప్యూటీ సీఎం పిఠాపురంలో వారాహి కృతజ్ఞత సభలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.