సినీ నిర్మాతలతో సమావేశం కానున్న ఏపీ డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సినీ నిర్మాతలతో భేటి కానున్నట్లు తెలుస్తోంది. కాగా విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్‌లో ఈ రోజు మధ్యహ్నం ఈ సమావేశం జరగనుంది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా సినీ నిర్మాతలు ముందుగా ఎన్డీయే సర్కారుకు అభినందనలు తెలియజేయనున్నారు. అనంతరం చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల్ని కూడా వారు పవన్ కళ్యాణ్‌కు వివరించనున్నారు. కాగా వీరిలో అశ్వనీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగపల్లి ప్రసాద్, డివీవీ దానయ్య, దిల్ రాజు తదితరులు ఉన్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి.