ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈజ్ ఆన్ డ్యూటీ
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నిన్న బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశ్రాంతి లేకుండా శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న పంచాయితీ రాజ్ అధికారులతో పవన్ కళ్యాణ్ భేటి నిర్వహించారు. ఈ రోజు ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంతో ఆయన సమావేశం అయ్యారు.ఈ సమావేశం ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైనట్లు సమాచారం. అప్పటినుంచి కూడా డిప్యూటీ సీఎం అధికారులతో చర్చిస్తూనే ఉన్నారు. ఈ విధంగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పవన్ కళ్యాణ్ పరిపాలనలో తన మార్క్‌ను చూపిస్తూ ముందుకెళ్తున్నారు.

