ఇంటర్నేషనల్ టైగర్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని అరణ్యభవన్‌కు చేరుకున్నారు.కాగా అక్కడ నిర్వహించే ఇంటర్నేషనల్ టైగర్ డే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఈ రోజు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అరణ్యభవన్‌లో పులుల సంరక్షణపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.


 
							 
							