ఏపీ డిప్యూటీ సీఎంకు హైకోర్టులో ఊరట
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.కాగా పవన్‌పై నమోదైన కేసులో హైకోర్టు స్టే విధించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. గతంలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని పవన్ కళ్యాణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

