Home Page SliderTelangana

డీఎస్ మృతి పట్ల సంతాపం తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయనకు దేశ,రాష్ట్ర రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీఎస్‌కు సంతాపం తెలిపారు. తెలంగాణా ఉద్యమ సమయంలో డీఎస్ బలంగా తన వాదం వినిపించారని పవన్ వెల్లడించారు. అయితే 2,3 సందర్భాల్లో ఆయనను కలిశానని ఆయన పేర్కొన్నారు.ఆ సమయంలో డీఎస్ జనసేన ఎదుగుదలను ఆకాక్షించారన్నారు.కాగా ఏపీ మాజీ సీఎం జగన్ కూడా ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసి..డీఎస్‌తో తన తండ్రికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.