ఏపీ అప్పు రూ. 4 లక్షల 42 వేల కోట్లు, ఏటా 45 వేల కోట్ల కొత్త అప్పులు
ఏపీ అప్పులకు సంబంధించి కేంద్రం రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానమిచ్చింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. 2019తో పోల్చితే ఏపీ అప్పులు డబుల్ అయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019లో ఏపీ అప్పులు రూ. 2,64,451 కోట్లుగా ఉండగా, 2020లో రూ. 3,07,671 కోట్లు, 2021లో 3,53,021 కోట్లు, 2022 సంవరించిన అంచనాల ప్రకారం మొత్తం అప్పు రూ. 3,93,718 కోట్లు. ఇక 2023 నాటికి ఏపీ అప్పు మొత్తం రూ. 4,42,442 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా రూ. 45 వేల కోట్ల అప్పు చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు.