ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ పదవీకాలం పొడిగింపు
ఏపీ చీఫ్ సెక్రెటరీ నీరభ్ కుమార్ పదవీ కాలాన్ని డీవోపీటీ పొడిగించింది. కాగా ఆయన ఈ నెలాఖరులో రిటైర్ కావాల్సివుంది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు సీఎస్ పదవీకాలాన్ని పొడిగించాలని డీవోపీటీకి లేఖ రాశారు. దీంతో సీఎస్ నీరభ్ కుమార్ సర్వీసును మరో 6 నెలలు పొడిగిస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ విభాగం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నీరభ్ కుమార్ డిసెంబర్ 31 వరకు ఏపీ సీఎస్‌గా కొనసాగనున్నారు.

