Andhra PradeshHome Page Slider

రేపు రాజధానిలో ఏపీ సీఎం పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధానిగా అమరావతినే ఉంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రేపు అమారావతిలో పర్యటించనున్నారు. ముందుగా ఉండవల్లి ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సీఎం రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతంతో పాటు ఇతర నిర్మాణాలను కూడా పరిశీలించనున్నట్లు సమాచారం. అయితే ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి చంద్రబాబు అమరావతిలో పర్యటించడం పట్ల అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.