కేసీఆర్ నివాసానికి ఏపీ సీఎం వైఎస్ జగన్
తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత కోలుకుంటున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వాస్తవానికి కేసీఆర్‌కు చాన్నాళ్ల క్రితమే గాయమైన తాజాగా ఆయనను జగన్ పరామర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి-కేసీఆర్ కలయిక ఎంతో చర్చకు కారణమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల ఓటమిపాలైందన్న భావన వ్యక్తమవుతుంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని భావిస్తున్న అనేక మంది అభ్యర్థులను తప్పించడం, మార్పులు, చేర్పులతో ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా కేసీఆర్, జగన్ మధ్య ఎలాంటి చర్చలు జరిగాయన్నది తెలియాల్సి ఉంది.
