Andhra PradeshHome Page Slider

త్వరలో కుప్పంలో పర్యటించనున్న ఏపీ సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. కాగా ఈ రోజు ఆయన రాజధాని అమరావతిలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన ఈ నెల 25,26 తేదిలలో తన తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. దీంతో సీఎం పర్యటనకు భారీ స్వాగత ఏర్పాట్లు చేసేందుకు కార్యకర్తలు సిద్దమవుతున్నారు.