కాన్వాయ్ ఆపి ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఏపీ సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు తన కాన్వాయ్ ఆపి మరి ప్రజల నుండి వినతులను స్వీకరించారు.కాగా ఇవాళ సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుండి కాన్వాయ్‌లో సచివాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో తన ఇంటివద్ద ఉన్న ప్రజలను చూసి సీఎం తన కాన్వాయ్‌ను ఆపించారు.అయితే అక్కడ ఉన్న ప్రజలు తమ సమస్యలపై సీఎంకు వినతులు ఇచ్చేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం వారి నుండి వినతి పత్రాలు స్వీకరించారు. కాగా వినతులు స్వీకరించిన అనంతరం సీఎం వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.