చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్ష లేదన్న ఏపీ సీఎం
ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మాట్లాడుతూ..చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్ష లేదన్నారు. కాగా చంద్రబాబును ఎవరు కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తాను లండన్‌లో ఉన్నానని జగన్ స్పష్టం చేశారు. అయితే కేంద్రంలో బీజేపీ ఉంది. చంద్రబాబు దత్తపుత్రుడు కూడా బీజేపీతోనే ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సహా సగం మంది టీడీపీ మనుషులు ఆ పార్టీలోనే ఉన్నారు. అయినప్పటికీ ఈడీ,ఐటీ సంస్థలే చంద్రబాబు అవినీతిని నిరూపించాయని సీఎం జగన్ తెలిపారు. కాగా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఇప్పటికే కొట్టి వేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ ఏసీబీ కోర్టు కూడా చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తాజాగా కొట్టివేసి చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో చంద్రాబాబు ఈ నెల19 వరకు రాజమండ్రి జైలులోనే ఉండనున్నారు.