ఏపీ సీఎం పాడి రైతుల ప్రయోజనాలను అమూల్ సంస్థకు తాకట్టు పెట్టారు:ప్రత్తిపాటి
ఏపీలోని చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ ఇటీవల అమూల్ డెయిరీకి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాగా మాజీ మంత్రి,టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్ డెయిరీ మాకొద్దని పక్కరాష్ట్రాలు కన్నెర్ర చేస్తుంటే..సీఎం జగన్ మాత్రం ఎర్ర తివాచీ పరిచారని ఆయన విమర్శించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వమే అమూల్ ప్రతినిధిలా వ్యవహరిస్తోందని పుల్లారావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అమూల్ సంస్థకు పెద్ద పీట వేస్తూ..పాడి రైతుల ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.

