ఏపీ సీఎం పేరు తడబడిన గవర్నర్
ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్ర ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరును ఉచ్చరిస్తూ పొరపాటున తడబడ్డారు. స్పీచ్ ప్రారంభంలో సీఎం ‘నరేంద్ర చంద్రబాబు నాయుడు’ అంటూ పలకడం వైరల్ అయ్యింది. ఈ ప్రసంగంలో ఏపీ ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలను వివరించారు గవర్నర్. ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని, ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశారని, మెగా డీఎస్సీపై సంతకం చేశారని పేర్కొన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు.

