Andhra PradeshHome Page Slider

ప్రధానిని హగ్ చేసుకుని ఏపీ సీఎం ఎమోషనల్

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం  చంద్రబాబు చాలా ఆనందంగా కనిపించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాని మోదీనికి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధాని మోదీని హగ్ చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు అమిత్ షా,జేపీ నడ్డా వంటి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు సినీ అగ్ర హీరోలు చిరంజీవి,రజనీకాంత్ వంటి ప్రముఖులు కూడా హజరయ్యి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.