ఢిల్లీలో ఫుల్ బిజీగా ఏపీ సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ఫుల్ బిజీగా ఉన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అయితే దాదాపు అరగంటపాటు కొనసాగిన ఈ సమావేశంలో సీఎం ఏపీ రాష్ట్రానికి ఆర్థిక సాయం,విభజన హామీల అమలుపై ప్రధానితో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా మోదీతో భేటీకి ముందు సీఎం పియూష్ గోయల్,నితిన్ గడ్కరీతో విడివిడిగా సమావేశం అయ్యారు.ఏపీలో హైవేల విస్తరణ,ఇతర అంశాలపై గడ్కరీతో చర్చించారు. అనంతరం అనంతపురం- అమరావతి రహదారి,హైదరాబాద్-అమరావతి హైవేపై కూడా చర్చలు జరిపారు. కేంద్ర వాణిజ్య శాఖమంత్రి పియూష్ గోయల్‌తో సీఎం సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటి కొనసాగిస్తున్నారు.