అనంత్ అంబానీ పెళ్లికి ఏపీ సీఎం,డిప్యూటీ సీఎంకి ఆహ్వానం
భారత అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి రేపు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అంబానీ పెళ్లి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఏపీ సీఎం,డిప్యూటీ సీఎం అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే యూపీ సీఎం ఆదిత్యనాథ్,బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా పెళ్లి వేడుకలకు హాజరవుతున్నట్లు సమాచారం.

