త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 4న ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా సీఎం ఢిల్లీలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మాలాసీతారామన్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీలో సీఎం విభజన హామీల అమలుపై వారితో చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత వచ్చిన తర్వాత రాష్ట్ర బడ్జెట్‌పై ముందుకు వెళ్లే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.