Andhra PradeshHome Page Slider

“ఏపీ సీఎం చంద్రబాబు కార్యసాధకుడు”: సుమన్

ఏపీ సీఎం చంద్రబాబు కార్యసాధకుడని ,రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించగల సమర్థుడని సనీ నటుడు సుమన్ కొనియాడారు. ఈ రోజు సుమన్ తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు.కాగా చంద్రబాబు రాష్ట్రాన్ని  అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారన్నారు.అయితే గతంలో ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడ్డారన్నారు.  అలాగే సినీ పరిశ్రమలోని వారు కూడా  సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. విషయ పరిజ్ఞానం ఉన్న పవన్ కళ్యాణ్‌కు మంచి శాఖలనే కేటాయించారన్నారు. కాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన సత్తా చాటుతారని సుమన్ పేర్కొన్నారు.