ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలపై చర్చ
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సెక్రటేరియట్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అమరావతిలో రూ.2,723 కోట్లతో చేపట్టనున్న పనులు, రాష్ట్రంలో భారీ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలపనుంది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్ లో చర్చ జరగనుంది.

