కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం
ఏపీలో మరికాసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. కాగా ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల గురించి కేబినెట్ సభ్యులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెడితే..ఏపీ కేబినెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించనుంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మంత్రులతో చర్చించనున్నారు. BPCL రిఫైనింగ్ ప్రతిపాదనలపై కూడా కేబినెట్ సభ్యులు చర్చించనున్నారు. ఏపీలో అమలవుతున్న ఉచిత ఇసుక విధివిధానాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా తల్లికి వందనం,ఎక్సైజ్ పాలసీపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.