Andhra PradeshHome Page Slider

ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీలో ఈ నెల 16న  సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం సచివాలయంలో జరగనుంది.కాగా ఈ సమావేశంలో మరో 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించే అవకాశం ఉంది.ఏపీలో పథకాలు ,ఎన్నికల హామీల అమలు,రాష్ట్ర ఆర్థిక పరిస్థితి,నిధుల సమీకరణ తదితర అంశాలపై చర్చ జరుగబోతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.