ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..కీలక అంశాలు ఏంటంటే..?
ఏపీలో ఈ రోజు ఉదయం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం తాజాగా ముగిసింది.కాగా ఈ సమావేశం దాదాపు రెండున్నర గంటలపాటు కొనసాగింది.అయితే ఈ సమావేశంలో పలు కీలక అంశాల గురించి సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.అంతేకాకుండా ఏపీలో కొత్త ఇసుక పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో త్వరలోనే కొత్త ఇసుక పాలసీ విధివిధానాలు అమలులోకి రానున్నాయి.మరోవైపు పౌరసరఫరాల శాఖ రూ.2వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి రు.3,200కోట్ల రుణానికి కేబినెట్ ఆమోదం లభించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.