Andhra PradeshHome Page Slider

మెగా డీఎస్సీకి ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్

ఏపీలో ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఈ సమావేశంలో ప్రధానంగా మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీలో డిసెంబర్ 10 లోపు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.కాగా ఏపీలో జూలై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.